కన్నతల్లి కల్పవల్లి:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
నవ మాసాలు ముద్దుగా
గర్భంలో మోస్తుంది
కనురెప్పలా శ్రద్ధగా
కన్నతల్లి చూస్తుంది 

పూలలాంటి తన ఒడిలో
పిల్లలను ఆడిస్తుంది
సదనమనె  బడి గుడిలో
భవిత తీర్చుదిద్దుతుంది

చంకలోన ఎత్తుకుని
చేతిలోన పట్టుకుని
గోరుముద్దలు పెడుతుంది
క్షుధ బాధ తీర్చుతుంది

అమ్మ అనురాగదేవత
పరిమళించు సిరిమల్లి
పూజించుము అంచేత
ఆమె ఇంట కల్పవల్లి


కామెంట్‌లు