అక్షర హారాలు-జీవిత సత్యాలు:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
నేర్పును రైలు పట్టాలు
గొప్ప జీవిత సత్యాలు
విరితే మనసులు కలవవు
మరల అతికితే కుదరవు

ఎగసిపడే కెరటాలు
ఉదయించే కిరణాలు
బోధించును పాఠాలు
దిద్దునోయి! జీవితాలు

సుందర జలపాతాలు
విజయోత్సవ గీతాలు
పంచును నయనానందం
పెంచును హృదయానందం

ప్రతి ఒక్కటి సృష్టిలో
భగవంతుని దృష్టిలో
చూడ సర్వ సమానమే!
అక్షరాల వాస్తవమే!


కామెంట్‌లు