జీవితమే పోరాటం!:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
జీవితమే పందెం
గెలిస్తే గౌరవం
పరికింపగ అందం
మల్లెతీగ బంధం

యేరులా సాగాలి
శరంలా మారాలి
అడ్డంకులు వచ్చినా
రవి కిరణమవ్వాలి

పట్టుదల ఉండాలి
పోరాటం చేయాలి
చీకట్లు క్రమ్మినా
గెలుపు వశం కావాలి

జీవితం సాహసం
చేయాలోయ్! సతతం
చావో,రేవో తేల్చి
చరిత్రలో నిలవాలి


కామెంట్‌లు