సృష్టిలో గొప్పవి:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
నీరెంత తోడినా
సముద్రమే తరుగునా
విద్యనెంత పంచినా
తగ్గుముఖం పట్టునా

చెట్టునే నరికినా
దాతృత్వం మానునా
అపకారం చేసినా
క్షమాగుణం వీడునా

పువ్వులను నలిపినా
పరిమళం  దాచునా
సూదులతో గ్రుచ్చినా
కోపంతో రగులునా

సృష్టిలో చూడగా
ఎన్నెన్నో గొప్పవి
మేలులు చేయంగా
గుణంలో మంచివి


కామెంట్‌లు