అద్భుతం అమ్మ:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
అమ్మ మాట తీయదనం
వెన్నెల్లా మెత్తదనం
ఆలకిస్తే మాత్రం
భవిత అగును పూలవనం

అమ్మ మనసు నవనీతం
చూడ ప్రేమ పూరితం
లోకమంతా విదితం
కుటుంబంలో వసంతం

అమ్మ ఉన్న నిండుదనం
గృహంలోన చక్కదనం
ఆమె ప్రేమ చిక్కదనం
మంచు రీతి చల్లదనం

అమ్మలోని గొప్పతనం
చాటాలోయ్!అనుదినం
ఆమె ఇంట మూలధనం
సృష్టిలోన ఘనం ఘనం


కామెంట్‌లు