గురూపదేశం:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
నమ్మరాదు పుకారు
చేయునోయి!షికారు
నిర్ధారించుకొనుము
వాస్తవాలు ఒక మారు
 
వ్యాపించును వదంతి
నమ్మితే అధోగతి
పరిశీలన ముఖ్యము
అవసరమే జ్ఞానము

చెప్పుడు మాటలు చెరుపు
అధిగమిస్తే గెలుపు
ఉంటేనే మంచిది
అన్నింటిపై అదుపు

పుకార్లు పుట్టిస్తే
పుట్టగతులు ఉండవు
రాద్దాంతం చేస్తే
సత్ఫలితాలివ్వవు


కామెంట్‌లు