పరాజయం ఒక పాఠము:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
పరాజయం ఒక పాఠము
విజయానికి సోపానము
నిరాశతో క్రుంగరాదు
వెక్కి వెక్కి ఏడ్వరాదు

ప్రయత్నమే మానరాదు
వెనుతిరిగి చూడరాదు
గమ్యం చేరేదాకా!
కష్టం తీరేదాకా!

విజయాలకు పొంగిపోకు
అపజయాలకు క్రుంగిపోకు
తమతుల్యం ఉండాలోయ్!
స్థితప్రజ్ఞత చూపాలోయ్!

అపజయంలో జయముంది
ఈ సత్యం విస్మరించకు
వెనుకంజ మాత్రం వేయకు
ఆందోళన చెందబోకు


కామెంట్‌లు