మేటి మేలి మాటలు:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
బ్రతకాలి నీతిగా
వెలగాలి జ్యోతిగా
సభ్య సమాజంలో
ఉండాలి గొప్పగా

చూపాలోయ్! ప్రీతిని
వీడాలోయ్! భీతిని
చేసి చేసి మంచిని
తేవాలోయ్! ఖ్యాతిని

అందరికి మెప్పుగా
జీవితాన ఒప్పుగా
ఉంటే మేలు మేలు
ఈ జన్మకదే చాలు

ఓటమికి క్రుంగరాదు
గెలుపుకు పొంగరాదు
సమతుల్యం ముఖ్యం
పండాలోయ్! లౌక్యం


కామెంట్‌లు