మన బాధ్యత:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
మాతృభాషాభివృద్ధికై
కాస్త చేసుకో తీరిక
దాని పరిరక్షణ కొరకు
పెంచుకోవాలి కోరిక

సద్గుణాల సుమమాలిక
బ్రతుకులో ధరించుకొనుము
అవే విలువైన కానుక
పదిలంగా చూసుకొనుము

మాతృభాష చక్కదనము
నోటికదే తీయదనము
నలుదిశలా చాటాలోయ్!
తెలుగు వెలుగు గొప్పదనము

సహకరించే చేతులకు
భువిలో అన్నదాతలకు
కృతజ్ఞతతో ఉండాలి
ఇలలో తల్లిదండ్రులకు


కామెంట్‌లు