చక్కని నెలవంక:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
అందాల నెలవంక
చూసింది నా వంక
నింగిలో తిరుగుతూ
చేసింది కనువిందు 

గగనమ్మ సిగలోన
ఒదిగింది ముద్దుగా
మేఘమ్మ ఒడిలోన
కదిలింది హాయిగా

చుక్కల మధ్యలోన
చక్కగా ఇమిడింది
అంబరం గుండెపైన
సంబరం పొందింది

క్రమంగా పెరుగుతూ
మారింది నిండుగా
పున్నమి వేళ వెన్నెల
నిచ్చింది మెండుగా

నవ్వులే రువ్వుతూ
పువ్వులా పూచింది
దివ్వెలా వెలుగుతూ
అడుగు ముందుకేసింది

 అంటారు చంద్రవంక 
ఎంచక్కా ప్రేమగా
ముద్దులొలుకు నెలవంక
మారుతుంది వింతగా


కామెంట్‌లు