చిన్నారి ప్రబోధం:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
ఇరు వర్గాల మధ్య
మేలు కాదు ఘర్షణ
మన దేశాభివృద్ధికి 
సమైక్యతే రక్షణ

మహనీయుల మాటలు
కలిగించును ప్రేరణ
అభ్యాసనానికిల
అతిముఖ్యం ధారణ

తల్లిదండ్రుల సేవ
జీవితాన దీవెన
గురుదేవుల ప్రబోధం
ఎదుగుదలకు నిచ్చెన

మానుకుంటే మేలు
మితిమీరిన వేదన
పట్టుదల ఉన్న చాలు
సులువు లక్ష్య ఛేదన


కామెంట్‌లు