పక్షి ప్రబోధ గీతిక:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
కోపాన్ని అణచుకో
అనర్ధమని తెలుసుకో
శ్రేష్టమని శాంతగుణం 
వెంటనే అలవర్చుకో

నోటి దురుసు మానుకో
నియంత్రణ చేసుకో
శత్రుత్వం పెంచునది
మనశ్శాంతి దోచునది

అహం తగ్గించుకో
అవిధేయత వదులుకో
అందరితో ప్రేమగా
స్నేహాన్ని పెంచుకో

లోపాలు దిద్దుకో
నిన్ను నీవు మలచుకో
నలుగురికి ఆదర్శం
గొప్పగా చాటుకో


కామెంట్‌లు