త్యాగానికి గురుతులు:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
వేణువునే ఊదితే
వీణమ్మను మీటితే
రాగాలే పండవా!
వీనులవిందు చేయవా!

నిలువెల్లా గాయాలు
చూడంగా వేణువుకు
పలికేను సరాగాలు
హాయినిచ్చు వీనులకు

తనువంతా తీగలే
మధురిమల జల్లులే
సుతారంగా తాకితే
ఉదయించు రాగాలే

వీణ,వేణువు రెండూ
త్యాగానికి చిహ్నాలు
పరోపకారానికవి
నిలువెత్తు సాక్ష్యాలు


కామెంట్‌లు