ఆ రెండూ ప్రక్క ప్రక్కనే
ఎప్పుడూ కలిసే వుంటూ
ఒకటే పని చేస్తామనే మిడిసిపాటు
తెలుపు నలుపుల తేడా
తమలోనే వున్నా
తెలివిగా మెరసి మురిపిస్తాయి
లోకంలోని మెరుపులను చూపిస్తాయి
విడివిడిగానే ముడిపడుతూ
కలిసి కలల లోకంలో తేలిపోతూ..
జలతారు మబ్బులను
మబ్బులు కురిసే జల్లులను,
చినుకులకు మొలకెత్తిన మొక్కలను,
విరసేపువ్వుల నవ్వులను
జత కూడిన జాతరలను
కలవక ఒరిసి పోతూ చూపిస్తాయి
నింగి నేలల వ్యత్యాసాలని చూపుతూ
పాలు నీళ్లలా కలసి గమనించిన వన్నీ గుణిస్తూ
పక్కపక్కనే రైలుపట్టాల్లా ఉంటునే
ఎన్నో మైళ్ళ దూరం సాగిపోతూ
మరెన్నో రాగాలాపనలకు
మూలమౌతూ అలసిపోతుంటాయి.
రెప్పల మాటున కలలలోకంలో జేరుతాయి
గెలపు ఓటమిలా
కలవకుండానే కలిసి కవ్విస్తూనే
కరుణతో లోకాన్నీ చూపుతూ
సర్వాంగానాం నయనం ప్రధానం అంటూ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి