నగు మోము పెట్టలేని..:- డా సి వసుంధర
ఎన్ని బాధలు ఎదను కదిపినా 
పెదవులపై చిరునవ్వు చిందించుచుండు.
  
మనిషికి కాక మానుకోస్తాయా మానసిక బాధలు? 
మనసున్న మనిషి 
దాచుకోవాలి
బాధల్ని మనసులో.
 
నిప్పును వెదజల్లితే
ఎంతముప్పో,
ఎరుగవానీవు. దానిని నీకన్నిటితో ఆర్పుకో
పన్నీటి ఘల్లులా
పెదవులపై చిరునవ్వు
కురిపించు.
  ఎదురైన వారిని
మృదువైన నవ్వుతో
 పలకరించిన చాలు, వారికదే పదివేలు.
.
 ఇంట్లోనైనా, బయట నైనా కంటిలో తడి కనబడనియ్యకు.
    విరిసే కమలమునీవై
మెరిసే నిహారిక నీవై,
కురిసే చిరుజల్లు నీవై,
 అలరింపుము నీ
చిరునవ్వుతో  సర్వులను. ఆ చిరు నవ్వుల విలువెంతో 
  నలువ కూడా చెప్పలేడు. నీ ఇంటినీ
లక్ష్మికళ నిలువెల్లా
ఆక్రమించు. ఇంటా బయట  నిన్ను  మా లక్ష్మిగా భావింతురు
 ఆడ మగ అందరికి
 చిరు నవ్వే శ్రీరామ రక్ష.

కామెంట్‌లు