మా నాన్నకి ధైర్యమెక్కువే:- బి స్వాతి కరుణాకర్ - హైదరాబాద్
సాహితీ కవి కళా పీఠం 
సాహితీ కెరటాలు 
=============
నాన్న నేనంటే నీకు ప్రేమ ఎక్కువ.. 
నన్ను చూసుకున్నావు కంటికి రెప్పలా.. 
పెంచావు కష్టం నా దరి చేరనియకా..
అందుకే అంటున్నాను మా నాన్నకు ధైర్యమెక్కువే..

ఆడపిల్ల అని చూసే ఈ రోజుల్లో ..
సంతోషించావు నన్ను చూసి మురిసి..
నీ ప్రేమలో నిజాయితీ ఉందని తెలిసి.. 
అందుకే అంటున్నాను మానాన్నకు ధైర్యమెక్కువే..

మునిగిపోయావు నా ఆలనా పాలనలో.. మురిసిపోయావు నా అల్లరి చూసి, భరించి.. 
ప్రేమతో పెంచావు నన్ను నీ భుజాలపై మోసి..
అందుకే అంటున్నాను మా నాన్నకి ధైర్యమెక్కువే..

నింపుకున్నావు నన్ను నీ హృదయంలో.. హత్తుకున్నావు నన్ను నీ  గుండెలకి.. 
ఏనాడు కలిగించలేదు నాకు దుఃఖాన్ని.. 
అందుకే అంటున్నాను మా నాన్నకి ధైర్యమెక్కువే..

నాన్నా..నీవే నాకు ఆదర్శం.. నువ్వు లేక పోతే ఎక్కడిదీ..? నా జీవితం.. 
నా అణువణువునా ప్రవహించేది నీ రక్తం.. 
అందుకే గర్వంగా చెప్పగలను మా నాన్నకు ధైర్యమెక్కువే..


కామెంట్‌లు