సుప్రభాత కవిత : - బృంద
గుండె గుడిలో నిలిచిన దైవం 
నిండు మదిలో వెలిగే దీపం 
రెండు ఒకటై విరిసిన అందం
పండు వెలుగులు పంచే ఉదయం

అనంత సూర్యకాంతులు
అలుముకున్న ఆకాశం 
వంగి ఇలపై నీటి అద్దాన
తొంగి చూచేనెందుకో...

కలలన్ని కథలైపోగా 
అందుకోలేని ఆనందాలు 
అంతులేని వ్యధగా భరిస్తూ
అంతరంగాన అడుగున దాచేనేమో!

చిత్తరువై చిత్తమంతా 
నిండిన చిత్రము 
కట్టెదురుగా నిలిచి 
పండుగగా కనులకు తోచెనేమో!

ఆశించడం మానేసి 
అంగీకరించడం అలవాటు 
చేసుకుంటే  సమస్యలన్నీ
సర్దుకుంటాయేమో!

కొత్త అనుభవాలనిచ్చి 
కొత్త పాఠాలు నేర్పాలని 
కొత్త వేకువ తెచ్చు 
కొత్త వెలుగులకు....

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు