తానే నాన్న:- డా. మంజు ప్రీతం కుంటముక్కల-మదనపల్లి
సాహితీ కవికళాపీఠం
సాహితీ కెరటాలు 
=============
అనుకొనా అనుకోనా
నా సర్వస్వం తానే అనుకోనా

ఆకాశం నవ్వులు 
భూలోకపు ఓర్పులు
ఉషస్సు మెలకువలు
సంద్రపు అలలు
కలిసి జనించిన తాను

చిడ్డి బుడ్డి అడుగులతో
చిట్టి పొట్టి రూపంతో
దేవతై అరచేతుల్లో 
వాలింది తానే
చిన్ని బాధ్యతగా
తొలకరి సంతోషం పరిచయం చేసి 

అలకల మొలకల
నీటి చినుకుల దీపంగా
గుండె చప్పుడు తానే అంటూ
పలుకులే రాని పలుకులు 
ఇదేనేమో నా ప్రేమ రూపమంటూ

బాధలు వస్తే తల్లిగా
ఆనందం వస్తే నాదిగా 
హక్కున చేరి 
నాన్న జాగ్రత్త నుంచి జాగ్రత్త నాన్నా 
అనే తాను బంధమే 
అనుకొనా అనుకోనా
నా సర్వస్వం తానే అనుకోనా
నా చిట్టి పాప తానే అంటూ 
చెప్పుకోనా చెప్పుకోనా
ఉండనా ఉండనా
రక్షగా నేనే ప్రాణమై తనకే ఎప్పుడూ...!
నాన్న నీకు పాదాభివందనం ఎప్పుడూ ...!!


కామెంట్‌లు