జంతు హక్కుల ఉద్యమాన్ని ప్రేరేపించిన ప్రయోగం:- - యామిజాల జగదీశ్
 1970, 80లలో, మనస్తత్వవేత్త ఎడ్వర్డ్ టౌబ్ మెదడు ప్లాస్టిసిటీని అధ్యయనం చేయడానికి కోతులపై వెన్నుపాము గాయం ప్రయోగాలు నిర్వహించారు. వాటి అవయవాలలో నరాలు తెగిపోయాయి.  జంతువులను వాటి వికలాంగ చేతులను ఉపయోగించమని బలవంతం చేయడానికి వాటిని బంధించారు.  కొన్నిసార్లయితే నెలల తరబడి బంధించారు.
1981లో, కొన్ని రహస్య ఫోటోలు మురికి బోనులు, చికిత్స చేయని గాయాలు, దిగ్భ్రాంతికరమైన నిర్లక్ష్యం బయటపెట్టాయి. ఇది సిల్వర్ స్ప్రింగ్ మంకీస్ కేసుగా మారింది. అమెరికాలో జంతు పరిశోధన ప్రయోగశాలపై జరిగిన మొదటి పోలీసు దాడి, ఆధునిక జంతు హక్కుల క్రియాశీలతకు ఆవిర్భావమూ అయింది.
ఈ పరిశోధన నేటికీ స్ట్రోక్ పునరావాసంలో ఉపయోగించే చికిత్సలకు దారి తీసినప్పటికీ, అది భారీ ఖర్చుతో కూడుకున్నది.
నాడీ శాస్త్రం, జంతు సంక్షేమం రెండింటిలోనూ ఇదొక మలుపవడం విశేషం.

కామెంట్‌లు