రాస లీలలు:- అచ్యుతుని రాజ్యశ్రీ

 బాలకృష్ణని రాసలీలలు అపూర్వమైన ఘట్టం చిన్న పిల్లవాడు కృష్ణుడు కానీ సరిగ్గా కృష్ణ తత్వాన్ని భగవంతుని లీలల్ని అర్థం చేసుకోలేక మనం జారుడు చోరుడు అని నిందిస్తాం అలాగే గో పకాంతలు ఇల్లు వాకిలి సంసారాన్ని విడిచి కృష్ణుడి దగ్గరికి పరిగెత్తడం తప్పుగా భావిస్తాం అసలు అంతరార్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శరత్కాలకు వెన్నెల్లో కృష్ణుడు యమునా తీరంలో వేణు గానం చేస్తూ ఉంటాడు ఇక్కడ గోపికలు రకరకాల పనులు చేస్తూ ఆయన యొక్క మురళీరవం వినపడగానే పనులు వదిలేసి చిన్నారి కృష్ణుని దగ్గరకు పరిగెత్తుతారు ఇలా వేల గాని వేళలో రాత్రిపూట కృష్ణుని గోపికలు కలవటం అసం సందర్భంగా అనిపిస్తుంది యమునా నది అంటే కాల్ స్వరూపం కాల ప్రవాహం మనం ఎన్నాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలీని  జీవులు.ఎన్నో సార్లు చచ్చి పుడుతున్న జీవులం. భక్తులను ఉద్ధరించాలనేది దైవ సంకల్పం.శరత్కాలంలో ఆకాశం నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది.మన మనసుకూడా పవిత్రంగా తేటగా ఉండాలి.ఫ్లూట్ వాయించటంలో అంతరార్థం సత్వగుణం తో భగవంతునిలో మమేకం కావాలి.గోపికలు కామోద్రేకులుకారు. భగవంతుడొక్కడే పురుషుడు.మానవులంతా స్త్రీలే. గోపికలు రహస్యంగా పారిపోలేదు. వారికి అనంగవర్ధనమైంది. అంటే ఆత్మ జ్ఞానం కలిగింది. అనంగుడు అంటే మన్మధుడు.కానీ ఇక్కడ  మోక్షంకోరుతూ ఆత్మోన్ముఖులైనారు.జీవ బ్రహ్మైకసిద్ధిని కోరారు.మధుర భక్తి భావంతో చెప్పిన ది కృష్ణుని రాసలీలలు. భగవంతునిలో విలీనం కావాలనే ఘోష గోపికలది.మనం తప్పుగా అర్ధం చేసుకుంటున్నాం. అష్టాంగయోగంలో పొందే స్థితిని ఒక్కొక్క కృష్ణునికి ఒక్కొక్క గోపిక. అన్నీ తానై నారీ నారీ నడుమ మురారీ, హరికి హరికి నడుమ వయ్యారిగా వర్ణన చేశారు కవులు.ఉపాసనాబలం పాదాల్లో ఉంటుంది.అందుకే పెద్దల పాదాలకి నమస్కరిస్తాం. ఆత్మ దర్శనం పొందాక గోపికలను విడిచి మాయమైనాడు. అంతటా అన్నిటా కృష్ణ దర్శనం చేసిన పుణ్యాత్ములు గోపికలు.అలా అంతరార్థం గ్రహించి అందులో వారు లీనమైన విధంగా మనం దైవాన్ని సదా కొలవాలి.తలవాలి🌷
కామెంట్‌లు