సాహితీ కవి కళా పీఠంసాహితీ కెరటాలు===============జీవితపయనం ఎల్లప్పుడూ వెలుగు బాటలు చూపంగాచీకటిదారులను చాకచక్యంతో దాటంగాగర్వం దరిచేరక సౌమ్యం గా మనం మనుగడ సాగించగామన జీవితం అందరూ మెచ్చే లాగా ఉండదాజీవనగమనంలో బలమైన లక్ష్యాలులక్ష్యాలు చేదించ కావాలి ఉన్నత ప్రణాళికలుప్రణాళికలు ప్రభావంతో కావాలి కార్యాచరణలుకార్యాచరణలు కారాదు బలహీన మార్గాలువిజయానికి ఆధారం శ్రమజలాలుశ్రమజలాలు అయితే నిరంతర ప్రవాహాలుప్రవాహంలో ప్రఖ్యాతి ముద్దాడు నీ పాదాలుపాదాలు అవుతాయి అందరికీ పథ ప్రదర్శనంఅందరికీ అవుతాయి ఆచరణ యోగ్యాలుమాటల్లో నిజాయితీతత్వంచేతల్లో నింపుకోవాలి మానవత్వంచూపులో ఉండాలి సమతత్వంఅదే కదా మనిషి జీవితానికి పరమార్థం
అంత్యాక్షరీ :-పార్లపల్లి నాగేశ్వరమ్మ-నెల్లూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి