కొరడా (రాళ్ళ) దెబ్బలు..?:- కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ -పోలయ్య కూకట్లపల్లి -అత్తాపూర్ హైదరాబాద్
జట్కాను ఎంత బలంగా 
ఎంత వేగంగా లాగినా...
"గుర్రానికి"... 
"తప్పవు..! "కొరడా దెబ్బలు"..!

ఎంత రుచికరమైన 
పండ్లెన్ని ఇచ్చినా..
కడుపు నింపినా...
"పండిన చెట్టుకి"...
"తప్పవు..! రాళ్ల దెబ్బలు"..!

ఎంత ఎత్తుకు ఎదిగినా 
ఎంతటి ఉన్నత పదవిలోఉన్నా 
"విశిష్ట వ్యక్తికి" 
"తప్పవు..! "విమర్శల బాణాలు"..!

కూడు తిని కుండను సైతం 
పగుల గొట్టి...బజారులో తిరిగే 
"కుక్కకు తప్పదు...! బెడితే పూజ"..!

కనిపిస్తే కస్సుబుస్సుమనే...
కసితో మాటల కత్తులు నూరుకునే...
పగతో రగిలిపోతు...విషం చిమ్ముకునే
"భార్యా భర్తలకు తప్పవు..! విడాకులు"..! 


కామెంట్‌లు