వేసవి సెలవులు మొదలయ్యాయి. జగదీశ్ 9వ తరగతి పూర్తి అయ్యింది. జూన్ నుండి 10వ తరగతిలో అడుగు పెడుతున్నాడు. "అమ్మా! ఈ సెలవుల్లో మాకు ఆన్ లైన్ క్లాసులట. సెల్ ఫోన్లలో రోజూ చూడాలి, వినాలి అని మా టీచర్లు చెప్పారు. ఈసారి ఎలాగైనా బెస్ట్ మార్కులు సాధించాలని పట్టుదలతో ఉన్నాను." అన్నాడు జగదీశ్. తల్లి ఎంతో సంతోషపడింది. రోజూ కొడుకుని ఆన్ లైన్ క్లాసులు వినమని సెల్ ఫోన్ చేతికి ఇచ్చింది. ప్రతిరోజూ ఉదయం నుండి సాయంకాలం పొద్దుగూకే దాకా జగదీశ్ సెల్ ఫోన్ కు అతుక్కుని కూర్చున్నాడు. మా కొడుకుకు ఎంత శ్రద్ధనో! చదువు తప్ప వేరే లోకం లేదు. అనుకున్నారు జగదీశ్ తల్లిదండ్రులు.
జూన్ 11 నాడు జగదీశ్ ఇంటికి పరమేశం వచ్చాడు. పరమేశం ఫస్ట్ ర్యాంకు విద్యార్థి. జగదీశుకు మంచి స్నేహితుడు. "బాగున్నారా ఆంటీ!" అంటూ జగదీశ్ తల్లిని అడిగాడు. "బాగున్నావా బాబూ! నువ్వు ఎలా ఉన్నావు? ఈ సెలవులు ఎలా గడిపావు?" అన్నది జగదీశం అమ్మ. "ఈ సెలవుల్లో మా పిన్ని ఆ తర్వాత మా పెద్దమ్మ ఊర్లకు వెళ్లాము. క్షణం తీరిక లేకుండా అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళతో కలసి ఆటలే ఆటలు. వందల కొద్దీ ఆటలతో టైం పాస్. టీవీలు అస్సలు చూడలేదు. ఒకరోజు కూడా సెల్ ఫోన్ ముట్టుకోలేదు." అన్నాడు పరమేశం. "అయ్యో! ఇన్ని రోజులూ ఆన్ లైన్ క్లాసులు చూడలేదా? స్కూళ్ళు ఓపెన్ అయ్యాక మీ టీచర్లలకు ఏమి సమాధానం చెబుతావు?" అన్నది జగదీశం తల్లి.
" జూన్ 12 స్కూళ్ళు ఓపెన్ అయ్యాక మాకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల పేరుతో క్షణం తీరిక లేకుండా చదువూ చదువూ చదువూ. కనీసం ఈ సెలవులు కూడా ఎంజాయ్ చేసే అదృష్టం లేదా? ఎవరు చెప్పారు సెలవుల్లో ఆన్ లైన్ క్లాసులు అని? ఏ క్లాసులూ జరగలేదు." అన్నాడు పరమేశం. "మరి మా జగదీశ్ సెలవులు మొత్తం ఉదయం నుండి, సాయంకాలం దాకా చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని ఆన్ లైన్ క్లాసులు విన్నాడు కదా!" అన్నది తల్లి.
"ఓ ఆంటీ! పిల్లలు ఆన్ లైన్ క్లాసులు వినేటప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు వెంట ఉండి చూడాలి. లేకపోతే మీ అబ్బాయి సెల్ ఫోన్లలో ఏమి చూస్తున్నాడో మీకు ఏమి తెలుసు? మీరు పట్టించుకోక పోవటం వలన మీ అబ్బాయి మిమ్మల్ని ఇన్ని రోజులు మోసం చేశాడు. ఈ రోజుల్లో సెల్ ఫోన్లలో పిల్లలు చూడకూడని అసభ్యకరమైనవి కూడా వస్తున్నాయి. పిల్లల చేతికి సెల్ ఫోన్లు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏమి చేస్తునారో మనం చూడాలి. లేకపోతే ఆ పిల్లలు మీ చేయి దాటడం ఖాయం." అన్నాడు పరమేశం. జగదీశుకు ఏమి చెప్పాలో తోచడం లేదు. పరమేశం క్లాస్ ఫస్ట్ అని అమ్మకు కూడా తెలుసు. రేపు స్కూలుకు వచ్చి, టీచర్లకు తన కొడుకు నిర్వాకం చెప్పాలి అనుకున్నది జగదీశం అమ్మ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి