అనుమానం ఒక ఆరని అగ్నిగుండం..?:- కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
నిన్న నీవు నా అనురాగ దేవతవే...
కానీ నేడు పిశాచివై నన్ను పీడిస్తున్నావు..!

నిన్న...నీ నవ్వు...ఒక తేనె చుక్క...
నేడు...అది  నా హృదయాన్ని
ముక్కలు చేసిన...ఒక విషపు చుక్క..!

నిన్న నీవు అందాల అపరంజి బొమ్మవే...
నేడు రాచి రంపాన పెట్టే బ్రహ్మరాక్షసివే..!

నిన్న నీవు పక్కలోకి రాకపోతె
కంటికి కునుకే రాదాయె...
కానీ నేడు నీవు నాప్రక్కలో
బల్లెమై నాకు నిద్ర కరువాయె..!

అనుమానం పెనుభూతమై...
అనురాగ బంధాలు బీటలు వారే...
ప్రేమ పుష్పమై విరిసిన కాపురంలో
మూడో నీడే నిప్పై ఆరనిమంటలు రేపే..!

మూడో వ్యక్తి...
కనిపించని కత్తియై...
బలమైన బంధాన్ని ఛేదించే... 
సంశయపు సముద్రంలో...
అపార్ధపు అలలు ఎగసి...
విషాదం విషం చిమ్మే
రంధ్రం చిన్నదైనా
ప్రేమ పడవ మునిగిపోయె..!

ప్రేమను పాతరేసిన ఆ పాపమెవరిది..?
ప్రేమకు నిప్పు పెట్టిన ఆ నీడ ఎవరిది..?
అనుమానం ఒక ఆరని అగ్నిగుండం...
తప్పెవరిదో ఎవరికెరుక ఆ దైవానికితప్ప.?

ఒకప్పటి ఒట్టు ఒడంబడికలు కరిగె...
కాపురం కోటలో కలతలు రాజ్యమేలె...
భార్యా భర్తల స్వప్నం బుగ్గిపాలైపోయె..!

అపార్ధాల కారుచిచ్చు పుట్టి
అంతరంగం దహించుకుపోతోంది
విశ్వాసపుగూడు కన్నీటిలో కరిగిపోయె
నిన్నటి నవ్వులు నేడు నీలినీడలై నిలిచె
వివాహబంధం మూన్నాళ్ళముచ్చటాయె.!

కన్నతల్లిదండ్రుల
కమ్మని కలలు కాలి బూడిదాయె...
ఆ అదృశ్య పరమాత్మ
ఆడించిన ఆటలో ఇద్దరూ ఓడిపోయె..!

హృదయంలో గాయమై...
అనుమానం పెనుభూతమై...
పచ్చని కాపురంలో చిచ్చు రేగే...
బంధం భస్మమై విడాకులు విధియై...
చివరికి చేదుజ్ఞాపకాలే మిగిలిపోయె...
ప్రేమపుష్పం మళ్ళీ పూయాలని ఆశిద్దాం..!



కామెంట్‌లు