క్రికెట్ పిచ్చి శ్రుతి మించితే : సరికొండ శ్రీనివాసరాజు
  వేసవి సెలవులు మొదలు అయ్యాయి. వాసు ఒక పని మీద బయటకు వెళ్ళాడు. దారిలో మిత్రబృందం క్రికెట్ ఆడుతూ కనిపించారు. వాసు అటువైపు వెళ్ళాడు. బ్యాటింగ్ చేస్తున్న రాము, "వాసూ! నాకు అర్జంటు పని పడింది. నా బదులు నువ్వు బ్యాటింగ్ చెయ్యి. ఆట చాలా ఉత్కంఠ భరితంగా ఉంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఓడిపోతాం. జాగ్రత్త!" అని చెప్పి వెళ్ళాడు. వాసు ఆట మీదే ధ్యాస పెట్టి ఆడుతున్నాడు. చివరి వరకూ ఔట్ కాకుండా ఆడినాడు. కానీ 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. వాసు చాలా నిరాశతో ఉన్నాడు. ఆ తర్వాత వాసు తాను వచ్చిన పని గుర్తుకు వచ్చి, కంగారు పడ్డాడు.
      వాసు వాళ్ళ తెలుగు ఉపాధ్యాయుడు అటుగా వెళ్తున్న వాసును పిలిచి, "ఒరేయ్ వాసూ! నాకు అత్యవసరంగా ఈ లిస్టులో ఉన్న మెడిసిన్స్ కావాలిరా! నాకు ఈ ఎండలో నడిచి వెళ్ళే ఓపిక లేదు. పుణ్యాత్మునిలా నువ్వు కనబడ్డావు. డాక్టర్ ఈ చిట్టీలో రాసిన మందులు తెచ్చి ఇవ్వరా! నేను ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను." 1000 రూపాయలు ఇచ్చాడు. వాసు అవి తీసుకుని వస్తుండగా క్రికెట్ ఆట కనబడి, ఆ ఆట చూస్తూ పనిని మరచిపోవడం, రాము బ్యాటింగ్ అప్పజెప్పడం జరిగింది. క్రికెట్ అయిపోయాక వాసుకు వచ్చిన పని గుర్తుకు రావడం, షాపుకు వెళ్ళి, మెడిసిన్స్ కొనుక్కు రావడం జరిగింది. వెళ్ళి చూడగా అక్కడ ఉపాధ్యాయుడు లేడు. అక్కడా ఇక్కడా వెతికాడు. ఎక్కడా కనబడలేదు. క్రికెట్ పిచ్చి ఎంత పని చేసింది. తననూ రామూను తిట్టుకున్నాడు. అసలే తెలుగు ఉపాధ్యాయుడు చాలా చాలా స్ట్రిక్ట్. స్కూళ్ళు మొదలు అయ్యాక తన పని గోవిందా! వాసుకు ఏడుపు ఆగడం లేదు.

కామెంట్‌లు