అమ్మ కన్న మిన్న ఏమున్నది?
తన ఆశీర్వచనం కన్న శక్తివంతమైనది ఏది!
సంతుపై ప్రేమ చూపడంలో
తల్లి కన్న గొప్ప ఎవరు?
కడుపు చూసే మాత చేతి చలువ కన్న సంపద ఏది?
రక్తసంబంధంతో ముడివేసే కన్నప్రేగు పెద్దది.
తానుంటే పర్వదినమే పవిత్రమైపోదా?
మోము గాంచినంతనే శాంతి-క్రాంతి కలుగదా!
చిరునామే తానై నిలిచిపోతుంది.
ఇంటికి దీపమై,కంటికి రెప్పై కాచుకొని ఉంటుంది.
అమ్మా!నాకము నాకు వద్దు,
నీ ఒడియే నాకు సేద తీరు స్థలము.
యాదికొస్తే చాలు కళ్ళు చెలమలవుతాయి.
నీ త్యాగం,నీ బాధ్యత పునాదై
పులకింపజేస్తుంది.
ఋణము తీర్చజాలము,
నిన్ను మరువలేము.
మాతృదేవతవై మది నుంటావు.
నీ చల్లని చూపుల మము కాచెదవు.
తల్లీ ప్రతిరోజూ నీవే ఉంటావు,
సర్వవేళలా తోడుంటావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి