న్యాయాలు-871
ఉష్ణ ముష్ణేన శీతలమ్ న్యాయము
******
ఉష్ణము అనగా వేడి,వెచ్చదనము,జ్వలం,వేడిమి,సెగ,తాపము,శరీర ఉష్ణోగ్రత పెరుగుదలను సూచించే సంస్కృత సాంకేతిక పదము.ఇది ఒక శక్తి స్వరూపము.ఉష్ణేన అనగా వేడితోనే.శీతలము అనగా చల్లదనము,చలి, ఉష్ణోగ్రత తక్కువగా కలిగి ఉండటం అని అర్థము.
వేడి వేడి చేతనే చల్లబడుతుంది అని అర్థము.
ఈ ఉష్ణానికి వివిధ మతాలలో వివిధ రకాల నిర్వచనాలు ఉండటం విశేషం.
హిందూ మతములో ఆయుర్వేదం(జీవన శాస్త్రం) పద కోశంలో ఆయుర్వేదం యొక్క రెండవ అధ్యాయంలో ధరణ్యాది వర్గ ప్రకారం ఉష్ణ లేదా వేడి అనే పదము ఎనిమిది రకాల వీర్య శక్తులలో ఒక దానిని సూచిస్తుంది.13వ శతాబ్దపు రాజ్ నిఘంటులోని శ్లోకము ప్రకారం పిప్పలికి ఉష్ణా అని పేరు కలదు.
ఆహార నియంత్రణ మరియు వంట కళ ప్రకారం ఉష్ణ అనేది వంటలోని వేడి రుచిని సూచిస్తుంది.వాసుదేవ రాసిన 'యోగా సార సంగ్రహ'లో ఉష్ణ అనేది వెచ్చదనాన్ని సూచిస్తుంది.
ఉష్ణ అనేది 20 గుర్వది గుణాలలో ఒకటి.ఇది ఉత్తేజిత అగ్ని మహాభూతం వల్ల కలుగుతుంది.అలాగే శారీరక మరియు ఔషధ పరమైన వేడిని సూచిస్తుందని చెప్పడం జరిగింది. హోమియోపతిలో ఈ "ఉష్ణే ముష్ణేన శీతలమ్ న్యాయము"ను వేడికి సంబంధించిన మందులతోనే వేడిని తగ్గించడానికి ఉపయోగిస్తారు .
ఇక పురాణేతిహాసాల్లో ఉష్ణ అనే పేరుతో రాజ్యం కూడా ఉందని తెలుస్తోంది.అలాగే వరహ మిహురుడు రాసిన బృహత్సంహిత ప్రకారం ఉష్ణ అనేది అంగారక గ్రహం యొక్క ఐదు గమనాల్లో ఒకదాన్ని సూచిస్తుంది.
ఇక బౌద్ధ మతంలోని "స్మృతి యుపాస్థాన" అనే విభాగంలో ఉష్ణం వేడి యొక్క బాహ్య బాధను గురించి చెబుతుంది.దీని ప్రకారం బాధలు రెండు రకాలు ఉన్నాయి.జైన మతంలో ఉష్ణ అనేది ఎనిమిది రకాల స్పర్శ లలో ఒకదానిని సూచిస్తుంది.
ఇక విషయానికి వద్దాం. వేడిని వేడితోనే నయం చేయడం అంటే విద్యుత్ వేడికి, ఉష్ణానికి ప్రతీకగా చెప్పుకుంటాం. ఈ వేడి వల్లనే బల్బులు వెలగడం, మోటార్లతో నీటిని తోడుకోవడం చేస్తుంటాం. ఒక వైపు వేడిని రప్పించి కూలర్, ఏసీ మొదలైనవి నడుపుకుంటూ ఉంటాం. ఇలా సామాన్య ప్రజల భాషలో కూడా వేడిని వేడితో తగ్గించుకోవచ్చు అని చెప్పవచ్చు.
ఈ ఉష్ణానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే భౌతిక స్పర్శ లేకుండా కూడా బదిలీ అవుతుంది. వెలుతురు కిరణము ఉష్ణ శక్తికి మరో రూపం అంటారు.
ఈ ఉష్ణాన్ని రెండు వర్గాలుగా విభజించారు. వేడి మరియు చలి.చల్లని ఉష్ణోగ్రతలు గాలిలో తక్కువ స్థాయి వెచ్చదనాన్ని లేదా సూచిస్తాయి. ఎయిర్ కండిషన్ వ్యవస్థ ఉష్ణోగ్రత నియంత్రణలో సహాయపడుతుంది.
ఇలా ఉష్ణం గురించి పురాణాల్లో, ఇతిహాసాల్లో, ఆయుర్వేద గ్రంథాల్లో అనేక చోట్ల ప్రస్తావించడం జరిగింది.
పై ఉదాహరణల వల్ల "వేడి వేడి చేతనే చల్లబడుతుంది "అనేది తెలుసుకున్నాం. మరి ఈ "ఉష్ణ ముష్ణేన శీతలమ్ న్యాయము"ను వ్యక్తులకు వర్తింపజేసి "కోపం కోపం చేతనే చల్లారుతుంది" అంటుంటారు. ఇంతెందుకు వేడి వల్ల చేసిన జలుబుకు వేడి ఆవిరి పడితే తగ్గడం మనందరికీ తెలుసు.
ఇలా రకరకాల సందర్భాల్లో ఈ "ఉష్ణ ముష్ణేన శీతలమ్ న్యాయము"ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి