ఒక వైద్యుడు, ఆయన సహాయకుడు కలిసి అడవిలో ఉంటున్నారు. వైద్యగురువు చాలా కాలం నుంచి దేనికోసమో అన్వేషిస్తున్నారు.
కానీ తాను దేనికోసం వెతుకుతున్నదీ ఆ వైద్యగురువు శిష్యుడికి చెప్పలేదు. అప్పటికీ ఒకటి రెండు సందర్భాలలో శిష్యుడు దేని కోసమీ అన్వేషణ అని అడిగినప్పటికీ గురువు చెప్పలేదు.
వెతికి వెతికి అలసిసొలసి వచ్చే గురువుకోసం ఆహారం వండిపెట్టడం, వడ్డించడం, కాళ్ళు ఒత్తడం వంటి సపర్యలు చేస్తుంటాడు శిష్యుడు.
ఇలా చాలా కాలమే అయింది.
కానీ గురువు తన అన్వేషణను ఆపలేదు.
ఓరోజు గురువు ఎప్పటిలాగానే అడవిలోకి వెళ్ళారు. రోజుకన్నా ఎక్కువ సేపే తిరిగి తిరిగి వెతికి వెతికి వచ్చిన గురువుకి తీరా అక్కడ శిష్యుడు కనిపించలేదు. బదులు ఓ యువకుడు అక్కడ నిల్చున్నాడు. అయితే ఆ యువకుడు గురువును చూడడంతోనే సాష్టాంగ నమస్కారం చేశాడు.
గురువుకు అర్థం కాలేదు.
“ఎవరు నువ్వు” అని అడిగారు గురువు.
దానికి ఆ యువకుడు “గురువుగారూ, నేనే మీ శిష్యుడను” అన్నాడు.
గురువు అయోమయంలో పడ్డారు.
“ఏం జరిగింది....” అని గురువు ఆలోచిస్తుండగా పరిస్థితి అర్థం చేసుకున్న శిష్యుడు చెప్పడం మొదలుపెట్టాడు....
“గురువుగారూ, మీకోసం రోజూలాగే ఈరోజూ గంజి తయారుచేయడం మొదలుపెట్టాను. తీరా గంజిని కలిపే గరిట సగంలో రెండు ముక్కలైంది. దాంతో ఇక్కడే అటూ ఇటూ గాలించగా ఓ కట్టె కనిపించింది. ఆ కట్టెను తీసి దాంతో గంజి కలియతిప్పాను. అదేంటో తెలీదు...అప్పటిదాకా తెల్లగా ఉన్న గంజి కాస్తా నల్లబడింది. ఆ గంజి మీకు ఇవ్వడం ఇష్టం లేక ఆ గంజి పాత్రను పొయ్యి మీద నుంచి కిందకు దింపి మరొక పాత్రలో మళ్ళీ గంజి చేయడం మొదలుపెట్టాను. అది బాగానే వచ్చింది. ఇంతలో ఆకలేసి నల్లగా అయిపోయిన గంజిని నేనే తాగేశానండి. తాగిన కొన్ని నిముషాలకే నాకు దేహంలో మార్పు కనిపించింది. వయస్సు తగ్గి ఇలా యువకుడిలా మారిపోయాను” అన్నాడు శిష్యుడు.
గురువు గారు ఆ మాటతో కిందామీదా అయిపోయారు. “ఎక్కడా కట్టె....అది సామాన్యమైనది కాదు. దానికున్న మహత్తు అంతా ఇంతా కాదు. దాని కోసమే నేనింతకాలమూ వెతుకుతున్నాను” అని చెప్పారు.
దానికి శిష్యుడు జవాబిస్తూ “రెండోసారి గంజి కాచడానికి ఆ కట్టెనే కదండీ ఉపయోగించాను....పనైపోయిన తర్వాత ఆ కట్టె ఎందుకనుకుని దానిని పొయ్యిలో వేసి తగలబెట్టేశానుగా” అన్నాడు నెమ్మదిగా.
ఆ మాటలకు గురువుగారు కంగుతిని చతికిలబడిపోయారు.
ఆ కట్టె ఎలా ఉంటుందో చూస్తే గుర్తుపట్టగలవా అని గురువుగారు అడిగితే అబ్బే లేదండి అని శిష్యుడు పెదవివిరిచాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి