నేటి కల:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
కలకూ నిద్రకూ దగ్గరి చుట్టరికం ఉందేమో గానీ
బుజ్జగించి నన్నావహించేలా నిద్రనూ, 
అందమైన కట్ మిట్ కల నాలో  దుప్పటిలో దూరేలా 
తెగని ప్రేమతో ఆమె 
టు బర్డ్స్ ఎట్ వన్ షాట్ పథకం కథ అల్లింది

అరేబియన్ నైట్స్ కథలూ, అలీబాబా నలభై దొంగలను కథల్లోకి అమ్మమ్మ.   
వినసొంపుగా ఉందేమో కథ చెవికి
ఒక్కసారి మగత నాలో మూగే

ఎంత గమ్మతు, ఒక గుళికతో రెండు బాధలు పాయే
తీపిపొట్లం హోమియోపతి వైద్యం ఆనాడే తెలిసిందేమో!

నిద్ర కలకు కాంప్లిమెంటరీ 
కలేమో నిద్ర ఫాలోయర్ 
ఇవి ఇనిమికల్స్ కావు ఒకరికొకరు
గుడ్ ట్రీట్ మెంట్ 

ఏమో బాబూ ఇది వైద్య భాష అనకు
కవిత్వం పొదిగిన ఇలాజ్ 
కళల పొత్తిళ్ళు జారింది 

మనసును బట్టి కల
తీపి చేదు రుచి ప్రశాంత భీభత్స నటన
నిద్ర కలల దారి చెప్పే ఎన్సైక్లోపీడియా కవిత,కథ నడకే

క్రతువులన్నీ కళాత్మక వేణువులూదే
కవిత కథా వీధుల విహారి రంగుల కల


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
జీవితమే ఒక పెద్ద కల.. కల & నిద్ర అండ్ సృజనాత్మకత బావున్నాయి. కంగ్రాట్స్