నిఖిత 6వ తరగతి చదువుతున్నది. చాలా తెలివైన అమ్మాయి. అదే తరగతిలో అఖిల అనే అమ్మాయి చదువుతుండేది. ఎప్పుడూ విచారంగా ఉండేది. నిఖిత, అఖిల ఇరుగు పొరుగు ఆమ్మాయిలు. ఒకరోజు నిఖిత అఖిల వాళ్ళ ఇంటికి వెళ్ళింది. "ఏమిటి పిన్నీ! మీ ఆమ్మాయి ఎప్పుడూ దిగులుగా ఉంటుంది. ఎవరితోనూ సరిగా మాట్లాడదు." అని అడిగింది. "మా అమ్మాయి జాతకం సరిగా లేదు. ఆమె చదువులో రాణించదు అని ఉంది." అని చెప్పింది. "ఎవరా జ్యోతిష్కుడు. ప్లీజ్! నేనూ జాతకం చూపించుకుంటా పిన్నీ! ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్." అని బతిమాలింది నిఖిత. అఖిల వాళ్ళ అమ్మ నిఖితను ఆ జ్యోతిష్కునకు చూపించి జాతకం చెప్పమంది. నిఖిత చాలా చాలా అమాయకంగా కూర్చుంది. అప్పుడు ఆ జ్యోతిష్కుడు "ఈ అమ్మాయి చదువులో చాలా వెనుకబడి ఉంది. ముందు ముందు ఇంకా కష్టం. ఈ అమ్మాయి చదువు 10వ తరగతి ఫెయిల్ కావడంతో ఆగిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఏదైనా పని నేర్పిస్తే ఈమెకు చాలా మంచిది." అన్నాడు.
ఇంటికి వచ్చాక నిఖిత పగలబడి నవ్వింది. "చూశావా పిన్నీ! నేను చాలా అమాయకత్వాన్ని నటించి కూర్చున్నా. నా ముఖాన్ని చూసి, అంచనా వేసి, జాతకం చెప్పాడు. నేను చిన్నప్పటి నుంచీ క్లాస్ ఫస్ట్. నాకు ఈరోజు జాతకం చెప్పించుకోవడం మేలు అయ్యింది. ఇప్పటి నుంచి మరింత పట్టుదలతో చదువుతూ భవిష్యత్తులో పెద్ద ఉద్యోగాన్ని సాధిస్తా. నన్ను నమ్మి, విచారాన్ని వదలిపెట్టి నాతో కలసి పట్టుదలతో చదివితే అఖిల నా బెస్ట్ ఫ్రెండ్. లేకపోతే ఈ రోజు నుంచీ అఖిలకూ నాకూ మాటలు లేవు." అన్నది నిఖిత.
ఈ సంఘటన తర్వాత అఖిలకూ ఆత్మ విశ్వాసం పెరిగింది. మన జాతకం రాసుకునేది మనమే అన్న నమ్మకం కలిగింది. ఆ రోజు నుంచి ఇద్దరూ కలిసి చదువుతూ భవిష్యత్తులో పెద్ద ఉద్యోగాలు సాధించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి