పిల్లలూ రండి రండి బాగుంది
ఈ రోజు వెన్నెల/
పున్నమి పూవై విరిసింది భళా!ఇది కార్తీకమనే
నెల./
రండి వెడదాం కృష్ణ ఒడ్డుకు అందరం
బిల బిలా మాట్లాడుకుంటూ
ఒక దండుల, గల గలా
వచ్చేశాం. ఆహా!నదిలో నీరు పారుతూ మెరుస్తున్నాది
అపరంజిలా.
ఆటా పాటలతో
అంతులేనిసంతోషంతో
నవ్వు కొందాం కిల కిలా/
ఇలాంటి యాత్రలతో
అవుతుంది స్వర్గం
ఇల/
అవును మాస్టారూ
మీరన్నది నిజమే.ఆంధ్ర మాత కు,కృష్ణ అనిపిస్తున్నది
పూమాలలా.
అబ్బా!చూస్తూ ఉంటే ఎంత బాగుందో ! కాదు కదా
ఇది కల/
కృష్ణ బ్రిడ్జి ఎంత పొడవైనదొ!పిల్ల లందరూ చూడండిలా!
మీ మీ సంచుల్లోనీ
తినుబండారాలు కమ్మగా తిందాం ఇవ్వండిల.
హాయిగా ఆడుకొని
పాడుకొన్నాం ఇక ఇళ్లకు పోదాం ల ల ల లా.
ఇంట్లో వాళ్ళకి ఈ
కబుర్లు అన్ని చెప్పి
మురిపించాలి వాళ్ళని చాలా
Dr
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి