సుప్రభాత కవిత : - బృంద
మలయమారుతంలా  హాయి
అలదిపోతూ....
మనోహరమైన  మాయలో
ముంచిపోతూ...

మనోరంజకమైన రంగుల 
ముగ్గులేస్తూ..
మధుర భావాల ఇంపుగా
మోసులేయిస్తూ..

దూర గగననాల సీమల 
దరి చేర్చేలా...
నీలి మేఘాల పల్లకి
ఇలకు అందేలా...

తేలి పోవు ఆశల 
గాలిపటమై ఎగిరే
మేలి వన్నెల కలల 
చిత్రపటంలా....

విరియు గడ్డి పువ్వుల 
మెరయు చిన్ని రేకుల
ముగ్ద సౌందర్యాన వెలుగు
స్నిగ్ధ మైన మనసులా....

వచ్చు వెలుగుల తేరు 
తెచ్చు వరముల తీరు 
మెచ్చి మనసులు కోరి
విచ్చు సుమముల బోలు 

కొత్త వేకువకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు