నా తనువు ప్రాణం సర్వం నీకే .: చుంచు సంతోష్ కుమార్ -మర్రిముచ్చాల
సాహితీ కవి కళా పీఠం
సాహితీ కెరటాలు .
===============
మౌనపు వేదరోధన విరహం
నా చిరునవ్వుల 
సేవాల సమాధుల లోకం
మాటేసి కాటేసిందో తెలియదు కాలం
వీధి రాతల్లో కలం దొర్లి 
జరిగిందో ఈ దోషం
ఎలా  చెప్పను నీకై నా విరహం ..!!

తనివి తీరని తపనతో
తడిసి ముద్దవుతున్న
అలసటేరుగని కలల అలలై  
నిన్ను చేరిన ప్రేమ కథనవుతున్న 
నిత్యం చీకటి నదిలో ..!
ఏకాంతపు ఎడారిలో ..
ప్రేమలేఖ రాసిపెట్టి
నా గుండె గంట
ఘన ఘనమని మోగిస్తూ
నన్ను నేను మరచిన దారుల్లో నీకై
నా విరహపు వేదన 
పూజ గీతం పాడుతున్న ..!!

బతుకే భద్రంగా లేదని 
మనసు ఉత్తరం రాసుకొని
నింగికెగురుతోంది నీకై ..
బంధం తెగిన గాలిపటమై
వచ్చిపో ఒక్కసారి నాకై ఎక్కడున్నా ..
నీకై నా విరహవేదన విముక్తి చెందితే
కానుక ఇస్తా నీకు ..
నా తనువు, ప్రాణం ,సర్వం నీకే ..!!
__________


కామెంట్‌లు