పతంగి :- ఎడ్ల లక్ష్మి
పద పద పద చిలకమ్మా 
వెనుక ముందు చూడమ్మా
పై పైకి ఎగిరే పతంగిని 
నీవెగిరెగిరి పట్టి తేవమ్మా

దారము తెగిన ఆపతంగి 
దారి తప్పి పోతుందమ్మ 
రేప రేప మని నీవెగురుతు
గురి తప్పకుండా పట్టమ్మా

 గట్టిగ పట్టి లాగకు నీవమ్మా 
మాంజా దారము దానికుంది
కత్తి వోలె అది కోసేస్తుంది 
నీ కాలి వేళ్ళు జాగ్రత్త చిలకమ్మ 

నింగి మీద నీవు ఎగురుతూ 
బొంగరమోలే తిరుగుతూ 
రంగుల పతంగిని పట్టమ్మా 
జాగ్రత్తగా బాబుకు ఇవ్వమ్మా 


కామెంట్‌లు