అమ్మ మాట!:- ఎం. వి.ఉమాదేవి.
(ఆట వెలది )

అమ్మమాటలోన కమ్మనై వినిపించె 
నీతివాక్యములను రీతిగాను 
మంచిచెడ్డదెల్పి మమతలు పంచురా!
అమ్మచేతి బువ్వలమిత రుచియె!

చెడ్డమాటలాడ చెవిబట్టుకొనుచును 
దండనమ్ముజేసి దారిమార్చు 
బుద్ధిజెప్పుచుండు నొద్దిక నేర్పించు! 
అమ్మకన్న గురువు లవనిగలరె!?

కామెంట్‌లు