సాహిత్యంలో విశిష్ట సేవలు చేస్తున్న డా.చిటికెన కిరణ్ కుమార్ కు బుక్ ఆఫ్ రికార్డు.
తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫోరం సభ్యుడు, ప్రముఖ సాహితీవేత్త డా. చిటికెన కిరణ్ కుమార్ కు మనం బుక్ ఆఫ్ రికార్డు అందుకున్నారు. కిరణ్ కుమార్ సాహిత్య,సామాజిక, రాజకీయ అంశాలపై అనేక రచనలు కథలు, కవితలు, విమర్శనా వ్యాసాలు వంద పైచిలుకు పత్రికలలో ప్రచురితమైనవి. సామాజిక ఇతి వృత్తంతో తను రచించిన "ఓ తండ్రి తీర్పు " లఘు చిత్రానికి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులు లభించాయి. దక్షిణ కొరియా, జపాన్, శ్రీలంక వారు నిర్వహించిన ప్రపంచ శాంతి శిఖరాగ్ర సదస్సుల వెబినార్లలో కిరణ్ కుమార్ పాల్గొన్నారు. తన సేవలను గుర్తించి అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంస్థ వారు బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేస్తూ గురువారం రోజున ప్రశంసా పత్రాన్ని ఆన్లైన్ ద్వారా పంపించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం, మానేరు రచయితల సంఘం, సిరిసిల్ల సాహితీ సమితి కవులు, రచయితలు కిరణ్ కుమార్ కు అభినందనలు తెలిపారు.
*అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డులో సాహితీవేత్త డా. చిటికెన*
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి