విరిసిన వేల సుమాలలో
నీ చిరునవ్వే మెరిసేను
కురిసే కిరణాల కాంతులలో
కుసుమాలన్నీ మురిసేను
అద్దాల నీటి ముంగిట
నీ రూపే నిలిచేను
హద్దేమీ లేకుండా
ఆనందం నింగికెగసేను
మనసు వాకిట నీకై కట్టిన
మల్లెల మాలలు ఊగేను
మధుర పరిమళమే నీకు
నీరాజనమై తరించేను
గగనపు నుదుటన బొట్టువా!
కలిసిన చేతుల మణికట్టువా!
ప్రకృతి ఆకృతికి తలకట్టువా!
వెలిగే కన్నులతో ఇపుడే పుట్టావా!
ప్రతి అణువుకు చైతన్యం
ప్రతి మొక్కకు పచ్చదనం
ప్రతి జీవికి మరో రోజు
ప్రతి దినం నీ వరమేగా!
నీ ప్రేమకు ఆనందం
నీ కరుణకు దాసోహం
నీ కృపకు వందనం
నీ రాకకు ఇదే నా
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి