తాటాకు బొమ్మలపెళ్ళి: - సత్యవాణి

  పక్కవాళ్ళింట్లో పెళ్ళిపందిరికి తాటాకులగుట్టపెట్టారు.ఆగుట్టలోంచి ఒక కమ్మని ఏరుకొని ,అందులోంచి నీటుగా ఉన్న తాటాకుల ముక్కలను తీసుకొని,ఆ తాటాకులతో ఒక అమ్మాయిబొమ్మా,ఒక అబ్బాయిబొమ్మా చేసుకొనేదాన్ని.రెంటికీ తేడా అమ్మాయిబొమ్మకి వెనుక కొప్పుంటుంది. అబ్బాయికివుండదు.
     అమ్మాయికి చీరకట్టాలికదా!అమ్మది పాతదైపోయిన పెళ్ళి పట్టుచీర వుండనే వుంటుందికదా!నాబొమ్మకి సరిపడతీసుకొన్నాకా ,నానేస్తాలకీ తాటాకు బొమ్మలుంటాయికదా!మరివాటికిమటుకు చీరలొద్దాఅనుకొని వాటన్నింటికీకూడాచీరముక్కలను పంచేదాన్ని.
    అలా అమ్మచీరబొమ్మకుచుట్టి,చిన్నచీర ముక్కకు మధ్యలోచిన్నకన్నంపెట్టి బొమ్మతలనుండి తొడిగితే అదే జాకెట్ దానికి.
   మరి అబ్బాయి పట్టుపంచకిమాత్రంలోటేముంది?నాన్న పట్టుపంచ చింపితే వరుడికి పట్టుపంచే.
    ఆడబొమ్మ ముఖానికి పచ్చగా పసుపురాసి, నుదుటను కళ్యాణం బొట్టుతిలకంతోదిద్ది,కళ్ళుఅనుకొనే ప్రదేశంలో కాటుకపూసి,బుగ్గఅనుకొనే ప్రదేశంలో దిష్టిచుక్కపెట్టి
చేతులుగా భావిచేచోట అమ్మవిచిట్లిన గాజులముక్కలను
వేడిచేసి గాజుల్లావంచిచెేసినవితొడిగి 
 పెళ్ళికూతుర్ని అందగా తీర్చి దిద్ది,కొప్పులో రాధామనొహరంపూలగూత్తి వుంచితే అమ్మాయి అలంకరణ పూర్తి అయినట్టే. అప్పుడా అమ్మాయి సొగసును చూసి తీరాలి.పెళ్ళికొడుక్కేముంది?నుదుటను పొడవుగా తిలకందిద్ది,బుగ్గచుక్కపెట్టడమే.
    పెళ్ళిళ్ళసీజన్ లో పెళ్ళిఎవరిదైనా పల్లకీకూడా వెళ్ళి మెరుపుపూసలూ ,గాజుగొట్టాలూ,పల్లకీ బోయీలు చూడకుండా,చూసికొట్టబోయినా దొరక్కుండా తప్పించుకొని, తెంపితెచ్చుకొన్నవి వుండనే వున్నాయికదా!పెళ్ళికూతురుకి హారాలూ,గాజులూ,పాపిడిబొట్టూ,చె వులు అనకొన్నచోట వేలాడదీయడానికి జూకాలూ వగైరాలు అమరిపోయినట్లే.మరి మంగళసూత్రాలో అంటారా?ఇంటిలో ఇత్తడి బేడకాసులూ, ఇత్తడిఅణాకాసులూ,అర్థణాకాసులూ బంగారంలా మెరిసిపోతూ వుండనే వుంటాయికదా!వాటిని మంగసూత్రాలుగా చేయడానికి మాకంసాలి నాగభూషణం వుండనే వుంన్నాడుకదా! "కాస్త సూత్రాలుచెేసిపెట్టవా "అని జోరీగలా అతడిచెవిదగ్గర రొదచేస్తూ కాల్చుకుతిన్నా మంటే కనికరించి, కావలిసిన సైజులో సూత్రాలమిరిపోయినట్లే.పెళ్ళిళ్ళలో ఇచ్చిన కర్పూరం పుల్లలకుచుట్టిన చెమ్కీదారలు దాచివుంచుకొంటాం కనుక వధూవరులకు చెమ్కీదండలు అమరినట్లే.
    ఇంకేంకావాలి ?పెళ్ళిచేయడానికి లక్షణమ్మ వాళ్ళ నాలుగిళ్ళమండువా వుండనేవుంది .మంత్రాలు చదవడానికి పంతులులా ఆడారచ్చమ్మలతో, అంటే మాతో ఆటలాడే మా శేషగిరిబావా వైగైరా అబ్బాయిలు వుండనేవున్నారు.మంత్రాలదేముందీ? "అచ్చింతాయనమహా,బుచ్చింతాయనమహా"అని చదవనే చదివేస్తారుకదావాళ్ళు.
     పెళ్ళికి ఊరేగింపూవుందండోయ్ !రెండు వెడల్పైన తాటి తడపలను తీసుకొని వొకదాన్ని క్రిదవుంచి,మరోతడపను పల్లకీ బొంగులావొంచి పైనపెట్టి కట్టేస్తే పల్లకీ తయార్ .మనదగ్గర నిజంపల్లకీ దగ్గరనుంచి సేకరించిన పూసలూ ,గొట్టాలూ పెళ్ళికూతురికి హారాలుావైగారాలు చెయ్యగా మిగిలిపోయినవి బోల్లు బోల్డు వుండిపోయాయికదా!వాటితో ,నిజంపల్లకీకి బాబులా అలంకరణ చేయడం నాకురాదా ఏమిటి?
      పెళ్ళిచూడడానికివచ్చిన పేరంటాలు అంటే నాదోస్తులు, ఎండని ఊరేగింపుకు రాకుండా పెళ్ళిభోజనాలకు తయారై వస్తే పెడతామా ఏమిటి?అబ్బాయిలు పల్లకీ మోయాల్సిందే!అమ్మాయిలు పల్లకీకూడా ఊరేగింపుగా రావలసిందే!
     హమ్మయ్య ఊరేగింపైపోయాకా భోజనాలొకటేదామిగిలింది! మాలక్షణమ్మ, అందరిళ్ళనుండీ మేము సేకరించి తెచ్చిన అటుకులతో మంచి రుచిగా చేసిన పులిహారను, కరకబొడ్డాకులోనో,బాదంఆకులోనో వడ్డిస్తూ,ఇదే అన్నం పప్పూ ,ఇదే పులిహోర బూర్లూ అంటూ ఆప్యాయగా వడ్డిస్తే,కడుపు  నిండకపోయినా 'బేవ్ 'మని తేనుస్తూ,లేత అరటాకుని కిళ్ళీలా చుట్టుకొని,మేకలానముల్తూ,బొమ్మలపెళ్ళికార్యక్రమం ఆరోజుకు అక్కడ ముగించేవారం.
    మళ్ళీ ఎవరింటిలో బొమ్మలపెళ్ళికార్యక్రమంపెట్టాలన్నా,ఆయింటి ఇల్లాళ్ళు ఎండాకాలం ఎండవేడిలో ఉదయాన్నుంచీ పనులుచేసిన అలసట తీర్చుకోడానికి మధ్యాహ్నాలు ఆదమరచి గడపలపై తలలుఆన్చి నిద్రపోవాలిగదా!అప్పుడుగదా మరో దోస్తింట్లోయింట్లో బొమ్మలపెళ్ళికి కావలసిన ఆహారదినుసుల సేకరణ జరిగేది.  
మరోమారు మాపిల్లలందరం పెళ్ళివారమయ్యేది.
             
కామెంట్‌లు