పాతపొన్నుటూరు పాఠశాల ఆవరణలో గల గౌతమ బుద్ధుని విగ్రహం వద్ద పూలను అలంకరించి నివాళులర్పించామని పాతపట్నానికి చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పారశెల్లి రామరాజు తెలిపారు. 2569వ బుద్ధపూర్ణిమ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ మానవాళికి ఎన్నో స్ఫూర్తిదాయకమైన సందేశాలకు గౌతమ బుద్ధుని బోధనలు ఆదర్శప్రాయంగా నిలిచాయని అన్నారు. సభాధ్యక్షులు జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు మాట్లాడుతూ కోరికలు లేని వ్యక్తి సంపూర్ణ మూర్తిమత్వం గల జీవితాన్ని సాధించగలడనే భావన ఆనాటి బుద్ధుని పర్యటనలు చాటిచెప్పాయని అన్నారు.
తొలుత గౌతమ బుద్ధుని విగ్రహానికి గౌరవ అతిథిగా విచ్చేసిన భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు బొడ్డేపల్లి కృష్ణారావు, విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ అంబేద్కరిస్ట్ ముగడ మహేంద్ర కుమార్ లు పూలను అలంకరించి నివాళులర్పించారు. గ్రామ సర్పంచ్ ఎద్దు చామంతమ్మ, ఉప సర్పంచ్ డోల చిన్నారావు, స్థానిక యువ నేత ఎద్దు సంతోష్ కుమార్, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ బలగ రజని, విశ్రాంత వీఆర్వో బలగ అప్పారావునాయుడు, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత పారశెల్లి రామరాజు, మాజీ విద్యా కమిటీ ఛైర్మన్ కొర్లాన సురేష్, కె.రవి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమ వేదికపై పాతపొన్నుటూరు పంచాయతీ నుండి పదోతరగతి ఫలితాల్లో ప్రథమ ర్యాంకర్ గా నిలిచిన పతివాడ కుసుమ, రాయల పంచాయతీలో పదోతరగతి ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన కుద్దిగాం లాస్యలకు జ్ఞాపిక, బుద్ధుని అంబేద్కర్ గ్రంథాలతో పాటు ఒక్కొక్కరికీ 1000 రూపాయలు చొప్పున నగదు పారితోషికాలను పాతపట్నానికి చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పారశెల్లి రామరాజు అందజేసి ఘనంగా సత్కరించారు. వారితో పాటు వారి తల్లిదండ్రులను కూడా శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కుదమ తిరుమలరావు గౌతమ బుద్ధుని గూర్చి స్వీయ గీతాలను ఆలపించారు.
ఈ కార్యక్రమంలో పతివాడ కేశవరావు, పి.నిర్మల, కుద్దిగాం ధనలక్ష్మి, పి.ధరణి, పి.హరిణి, డోల దిలీప్, టెక్కలి నాని, పి.శేఖరరావు, అందవరపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి