సుప్రభాత కవిత :- బృంద
వెలుగు పువ్వులు కోస్తూ 
జిలుగు నవ్వులు చిమ్ముతున్న
చెలువు సోయగాల చిన్ని సుమాల 
కొలువు తీరిన బంగరు నేల

కొత్త వెలుగులతో నింపి
మత్తు మగతలను తెంపి
ఎత్తు కొండల పైన  వెలిగి
సత్తువను చేకూర్చు దొరను స్వాగతిస్తూ

చూపుల నింగి దారిని పరచి 
మోపుగ ఆశలు విన్నవించి
ఓపటి సంతోషం తెచ్చే
రేపటి వెలుగులకై ఎదురుచూస్తూ..

రేయిని  మిణుకుమన్న తారలన్ని 
వేయిగా మెరిసే పువ్వుల చూసి 
చేయి కలిపి చెలిమి చేయాలని
మొయిలు పల్లకిలో దిగివస్తూ...

అల గగనపు దారిని వీడి 
కలకల నవ్వుతూ ప్రసరించి
ఇలను ఇంపుగా పరిమళింప
కల వరించిన తీరున కదులుతూ..

సాగే మలయానిలపు డోల లో
తీగ చుట్టేసిన తరువులాటి 
ఊగే జగతిని మురిపంగా చూస్తూ
దిగే  దినకరునికి వందనములతో 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
చాలా బాగున్నది సర్