అడవిలో
ఆకుల కన్నా చౌకగా దొరికేవి
పూలు!!
అడవిలో
పులులకు కాయల కన్నా
తలకాయలే ఎక్కువ దొరుకుతాయి.!!
కాలం పై రాసే రాతలు
కథలు కాదు గుండె కోతలు!!
ఆకలి కోసమే అడవి పుట్టింది
పులి పుట్టింది.!!
దట్టమైన అడవిలో కాంతి ఉండదు
అడవి చుట్టూ చెట్టు మాత్రమే
ఉంటుంది.!!
అడవి
పూలు పూయాలంటే కాయలు కాయాలంటే
ఋతువులు కాదు
మృత్యులు రావాలి!!
అడవిలో పుట్టింది
పురాణాలు కాదు అలగా జనం కాదు.
మరణం!!
అడవి అంతా చెత్త కాదు
చెట్టు కాదు మత్తు గమ్మత్తు!!
అడవిలో చెట్టు కిందనే
గౌతమ బుద్ధుడు పుడతాడు
చెట్టు పైన మాత్రం
గరుత్మంతుడు ఎగురుతాడు.!!
అడవి అంటే అధికారం కాదు
మర్మం!!
అడివి అంటే ధర్మం కాదు
రూల్!!
అడవి అంటే ఆడది!!!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి