* నేటి నానీలు *( వర్షం - హర్షం )- కోరాడ నరసింహా రావు !
 ప్రాణికోటికి         
హర్షాన్ని కలిగించే 
  
వర్షం కురిసింది
  
 రైతుల సందడి
     ******
నీలాకాశం లో 
 నల్లని మబ్బు
నెమలి పురివిప్పింది
వర్షాన్ని స్వాగతిస్తూ..!
  ******
చిరు జల్లులు
వానగా మారెను
క్షేత్రా లన్నీ నిండెను
తొలకరి కోసం
   ****
 కప్పల బెక బెక లు
   
ఎదురుచూసిన వర్షం
 
రానేవచ్చింది
ఆనందం...!
     ******
అకాలవర్షాలు
పంటలకు నష్టం
సకాల వర్ష ములే 
 అందరికీ హర్షం ..!
    ****

కామెంట్‌లు