* అన్నదమ్ముల బంధం *: - . కోరాడ నరసింహా రావు !

 రక్త సంబంధాలను ప్రభావితం చేసి , 
నియంత్రించే ఆర్థిక స్థితి గతులు...!
తోడబుట్టిన అన్నదమ్ములు,ఒకరిపైనొకరికి ప్రేమాభిమానాలైనా..,
 ఆప్యాయతానురాగాలైనా బాల్యంలోనే...!
  వయసులు పెరిగే కొద్దీ... వాళ్ళస్థితి గతులలో తేడా  లొస్తే ..
.ప్రేమాభిమానాల స్థానంలో , ఈర్ష్యా సూయలు!
 ఆప్యాయతానురాగాలకు బదులు , పగలు,ప్రతీకారాలు !!
  ఇదంతా సహజమే నని ఎవడితలరాత వాడిది అనుకుని 
ఎవడిబ్రతుకు వాడు బ్రతికితే ఇబ్బంది లేదు !
    వాడు బాగుపడ్డాడని వీడు మత్సరించి, వీడు చెడిపోయాడని 
వాడు నీరస చేసే పరిస్థితులు సంభవిస్తేనో.... 
ఆస్తుల పంపకాల్లో తల్లిదండ్రులు అన్యాయం చేశారనో 
బద్ద శత్రువుల్లా అన్నదమ్ములు తయారు కాకుండా...,
ఎవరికి వారుగా బ్రతుకుతున్నా ఈర్ష్యాసూయలు 
పోతమరించకుండా బ్రతకగలిగితే అన్నదమ్ముల బంధం 
అర మరకలు లేకుండా కొనసాగుతుంది !
  ఈ ధనప్రభావకాలంలో ఇలాగైనా కొనసాగగలగటం గొప్పే ...!!
     *******
.
కామెంట్‌లు