9వ తరగతి చదువుతున్న మాలిని అనే విద్యార్థిని ఆ తరగతిలో మొదటి ర్యాంకు. చదువుతో పాటు గర్వం చాలా ఎక్కువ. ఇతరులను హేళన చేయడం ఆమె నిత్య కృత్యం. ఆ తరగతిలోనే శర్వాణి అనే అమ్మాయి వినయం గల విద్యార్థినిని. అందరితో కలిసిపోయేది. శర్వాణి నల్లగా ఉంటుంది. మాలిని రోజూ శర్వాణిని హేళన చేస్తూ, రకరకాల పోలికలతో వికటాట్టహాసం చేసేది. కానీ శర్వాణి ఇవేమీ పట్టించుకోకుండా తన చదువు తాను చదువుకునేది.
మాలిని శర్వాణిని హేళన చేస్తూ ఉండటం టీచర్ దృష్టికి వచ్చింది. టీచర్ మాలినిని తిట్టింది. అయినా మాలిని స్వభావంలో మార్పు రాలేదు. ఒకరోజు టీచర్ పిల్లలను ఒక తోటకు తీసుకొని వచ్చింది. కోకిల గానం అదే పనిగా వినిపిస్తుంది. శర్వాణి ఒకచోట చేరి, అదే పనిగా ఆ కోకిల గానం వింటుంది. టీచర్ శర్వాణి వద్దకు చేరింది. "ఏం చేస్తున్నావు తల్లీ!" అని అడిగింది. శర్వాణి పక్కనే ఉన్న శ్రుతి అనే అమ్మాయి "చెట్టు మీద కోకిల గానం వింటుంది టీచర్!" అన్నది. "కోకిల నల్లగా ఉంటుంది. కానీ దాని గానాన్ని ఎంతోమంది మెచ్చుకుంటారు. అదే పావురం ఎంత ముద్దుగా ఉంటుంది? కానీ దాని గొంతులో వచ్చే అరుపులు అస్సలు వినలేము. కొంతమంది చూడటానికి అందంగా కనబడతారు. లేదా చదువులో బెస్ట్ కావచ్చు. కానీ వారు దాన్ని చూసుకొని మురిసిపోయి, పొగరుగా ప్రవర్తిస్తారు. మరీ కర్ణ కఠోరంగా ఇతరులను హేళన చేస్తారు. అవి వినలేము. కాబట్టి తమ గొప్పను చూసుకుని, ఇతరులను హేళన చేసేవారు మూర్ఖులు. వాళ్ళకు దూరంగా ఉండటం మంచిది." అన్నది టీచర్.
"అందుకే టీచర్! శర్వాణిని ఎవ్వరు హేళన చేసినా శర్వాణి పట్టించుకోదు. అది ఆ మార్ఖులకు అర్థం కాదు." అన్నది శ్రుతి. అక్కడే ఉన్న మాలిని సిగ్గుతో తల దించుకుంది. గర్వం అణగిపోయింది. మళ్ళీ ఎవ్వరి జోలికి పోలేదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి