భాగవతంలో రాక్షసులు .: - .అచ్యుతుని రాజ్యశ్రీ

 బాలకృష్ణుని లీలలు అద్భుత ఘట్టాలు.వాటి అంతరార్థం గ్రహించాలి మనం.కాళింగుని మర్దనం అందరికీ తెలుసు.మొదట రమణక ద్వీపములో ఉండేవాడు.ఒకసారి గరుడుని తన 101 తలలతో కాటేశాడు. అంతే గరుడుని తన్నులకు భయపడి కాళింది నదిలో దాగాడు భార్యా పిల్లలతో కలిసి! వాడు గోపబాలురు గోవుల్ని తన విషంతో బాధించటం కృష్ణుడు వాడిపడగలపై తాండవమాడటం వాడు రక్తం కక్కుకోటం మనకుతెల్సిన కథ.ఇక అంతరార్థం ఏమంటే మనిషి పుట్టుక  రమణకద్వీపంలో! అహంతో దైవ పూజలు పితృకార్యాలు మానేసి కాళింగునిగా మారుతాం. అదే విషంతో నిండిన కాళిందినది మన ఇల్లు,సమాజం! మంచితనం లేకుండ బుసలు కొడ్తే శరీరం నాడుల్లో విషపు ఆలోచనలు వస్తాయి.అహంకారం లేని నిర్మల జీవితం గడపాలి అని తెలుసుకోవాలి.
ఇక ప్రలంభుడనే రాక్షసుడు బలరాముని చంపడానికి వస్తాడు.ఆసంగతి పసిగట్టిన కృష్ణ పరమాత్మ  వాడిని తన జట్టులో చేర్చి ఆటకు సిద్ధం ఐనాడు.ఓడినవారు గెలిచిన వారిని తమవీపుపై మోయాలి. కృష్ణుడు బలరాముడు రెండు జట్లుగా ఆడుతారు కృష్ణుని జట్టు ఓడిపోతుంది అప్పుడు ప్రలంబుడు బలరాముని తన వీపుపై ఎక్కించుకొని చంపాలని ప్రయత్నం చేస్తాడు నల్లటి ఆ రాక్షసుడి వీపు మీద తెల్లటి బలరాముడు ఉన్నాడు కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా బలరాముడు వాడి తలమీద పిడుగులతో దాడి చేసి వాడిని చంపాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే దేవుడు తనని పూర్తిగా నమ్మిన వారిని తప్పక రక్షిస్తాడు భక్తులను హింసించే వారిని శిక్షిస్తాడు అందుకే బాలకృష్ణుడు తన అన్న బలరాముడికి ముందే సూచనగా ఈ విషయం చెప్పాడు దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమంటే బాల్యం నుంచి పిల్లలకు దైవభక్తి దేశభక్తి నేర్పాలి యుక్తిగా మనం నడుచుకోవాలి ఎవరైనా భక్తున్ని మనం తూలనాడరాదు ఇదే భాగవతంలో కృష్ణుడు చేసిన బాల క్రీడల్లోని అంతరార్థం🌹
కామెంట్‌లు