‘అద్భుత సృష్టి’:- -పైడి రాజ్యలక్ష్మి
 రోజు ఉదయించే దినరాజు
ఏరోజు ఇంకిపోని సముద్రం
క్షణం తీరికలేక తిరిగే గాలి
ఏ క్షణం చల్లదనాన్ని వీడని నీళ్లు
పగటి పూట అంబరం లో ఎగిరే పక్షులు
రాత్రి పూట ఆకాశం లో మెరిసే తారకలు
శ్రమ లేకుండా మెల్లగా సాగె నదులు
అనుకోని అతిథిలా వచ్చే వానలు
ముళ్ల పొదలలో చిక్కుకున్నా
మట్టిముద్దల మధ్య మనుగడ సాగిస్తున్నా …
కోమలత్వాన్ని కోల్పోని మెత్తని పువ్వులు
ఎన్నెన్నో రంగులతో…
మరెన్నో హంగులతో
అపురూపంగా అలరారుతున్న
పరమేశ్వరుని అద్భుతసృష్టిలో
కొంత కాలం వుండిపోయేందుకు
అరుదెంచిన బాటసారులైన మనం
ప్రారబ్ధం చేతిలో కీలు బొమ్మలం

కామెంట్‌లు