ఇదొక అద్భుతమైన విశిష్టత కలిగిన వృక్షం. కెనడాలోని జియో లాజికల్ సర్వే శాస్త్రజ్ఞులు బయోలాజియో టెక్నాలజీ పద్ధతిలో పరిశోధనలు చేసి ఈ బ్లాక్ స్ప్రూవ్స్ చెట్టు తన బెరడులోని పుల్ల పుడకలలోనూ బంగారాన్ని నిలువ ఉంచుతుందని కనుగొన్నారు. బంగారం ఉనికిని తెలియజేసే'ఆర్సినిక్'లోహం కూడా ఈ చెట్టు బెరడులో నిలువ ఉంటుందని'అల్డర్ 'అనేటువంటి మరో చెట్టు బెరడులో కూడా ఈ బంగారం నిలువ ఉంటుందని కనుగొన్నారు.
సీక్వియా మహా వృక్షం.
దీని యొక్క ఎత్తు 90 మీటర్లు. దీని కాండా వ్యాసం పది మీటర్లు. ఇది దాదాపుగా 4000 సంవత్సరాలకు పైగానే కాలిఫోర్నియా అడవుల్లో జీవిస్తూనే ఉంది. ఇది అది తక్కువ కాలం జీవించి నేటికీ కూడా సజీవ వృక్షంలో నిలిచిన మహా వృక్షంగా పేర్కొనవచ్చు. ఈ జాతి వృక్షాలు అక్కడ ఎక్కువగానే ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.
బ్లాక్ స్ప్రూవ్స్ చెట్లు. :- తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి