మా అమ్మమ్మ ఒకసారి నాకొక చిట్కా చెప్పింది....కష్ట సమయాల్లో, చిన్న చిన్న అడుగులు వేస్తూ ముందుకు సాగు.చేయాల్సింది కొద్ది కొద్దిగా చెయ్యి.భవిష్యత్తు గురించో లేదా రేపు ఏమి జరగవచ్చో అని ఆలోచించకు.పాత్రలు కడుక్కో.దుమ్ము దులుపు.ఇష్టమైన వారికొకలేఖ రాయి.సూప్ తయారు చెయ్యి.చూసేవా, ఇలా చేసుకుంటూ పోతే ముందుకు మున్ముందుకు అంచెలంచెలుగా సాగుతుండటాన్ని గ్రహిస్తావు.ఒక అడుగు వేసి ఆగు.కొంచెం విశ్రాంతి తీసుకో.నిన్ను నువ్వే వెన్ను తట్టి ప్రశంసించుకో.మరొక అడుగు వెయ్యి.తరువాతమరొక అడుగు వెయ్యి.నువ్వు గమనించక పోవచ్చు,కానీ నీ అడుగులు మరింత ముందుకు పోతుంటాయి.నువ్వుబాధపడకుండాఆందోళన చెందకుండాభవిష్యత్తు గురించి ఆలోచించగలిగే సమయం వస్తుంది.~ ఇంగ్లీషులో చదివాను. బాగుంది కదాని తెలుగులో కూర్చాను.
అమ్మమ్మ మంత్రం:- - జగదీశ్ యామిజాల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి