జనులదరిచేరే సాధనం:-డా.భరద్వాజ రావినూతల-కొత్తపట్నం
సాహితికవికళాపీఠం
సాహితీ కెరటాలు
💐💐💐💐💐💐💐💐💐💐
సెల్‌లోకి జారిన సమాజం,
స్పర్శల్ని మర్చిన పరిచయం।
చూపులు చాటిన మాయ,
చాట్‌లో చిక్కిన హృదయం।

ఫాలోవర్స్ కోసం పోటీ,
ఫీలింగ్స్ గల్లంతు గమనించు।
ఫొటోలకు ఫిల్టర్లు వేసి,
నిజాలను దాచిన ప్రపంచం।

సెల్ఫీకి సెన్సు లేదు,
సత్యం తడిసిపోయింది।
లైకులకే లయ తప్పి,
లావుగా బతుకు మరిచింది।

ట్రెండ్లకు తలవంచే మనిషి,
టైమ్‌లైన్‌లో తాను కనబడదు।
ఇన్‌బాక్స్‌లో ఊహల వర్షం,
ఇంట్లో శూన్యమే మిగిలింది।

కామెంట్‌లు