సాహితీ కళాపీఠం,
సాహితీ కెరటాలు,
============
ఆ ప్రియుడు విరహవేదనతో
ఆరాటపడి పోతున్నాడు..
కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తు అలానే
ఉండిపోయాడు,
ప్రతిక్షణం ఆమెను తలుచుకుంటూ తపిస్తున్నాడు -
పైకి నవ్వుతూ,లో లోపల కుమిలిపోతూ.
శూన్యంలో వెతుకుతున్నా ప్రతి క్షణం..
బాధతో బరువెక్కి పోతున్నా మనసు,
తనకితాను ఊహల్లో తేలిపోతూ -
ఆకాశంలో విహరిస్తు తాన మదిలో దాచుకున్నాడు
నిండుగా !
విరహవేదనతో విహంగ వీక్షణమై-
తలపుల రాగంలో తాళం కదుపుతున్నా,
మండే సూర్యునితో చల్లదనంతో పోటీపడుతు,
గుండెల్లో నింపుకున్నా రూపం ప్రతిరూపం,
చెలియా నీకోసం ఆరాటం.
ఆమె కోసం చేస్తున్నా ఈ పోరాటం,
విరహ వేదనతో చలిమంటలు కాగుతున్నా
గడియ గడియగా,
ప్రతి బాధ ఆమె కోసం అనుభవిస్తున్నా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి